Home సినిమా దేవర-2 కాదు.. తెరపైకి అదుర్స్-2 .! – ACPS NEWS

దేవర-2 కాదు.. తెరపైకి అదుర్స్-2 .! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


‘డ్రాగన్’ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏది?
‘దేవర-2’, ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాల పరిస్థితి ఏంటి?
‘అదుర్స్-2’కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్'(డ్రాగన్) సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా జోర్డాన్ షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.

‘డ్రాగన్’ తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడా? అనే ఆసక్తి. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర-2’ చేస్తాడా లేక త్రివిక్రమ్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ చేస్తాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ‘అదుర్స్-2′(అదుర్స్ 2) తెరపైకి వచ్చింది.

‘అదుర్స్-2’ చేయాలనే డిమాండ్స్ అప్పట్లో ఫ్యాన్స్ నుంచి తెగ వినిపించేవి. దర్శకుడు వి.వి. వినాయక్, రచయిత కోన వెంకట్ కూడా ‘అదుర్స్-2’ చేయడానికి రెడీనే అని పలు సందర్భాల్లో చెప్పారు.

అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలంతా భారీ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ‘అదుర్స్’ లాంటి కామెడీ సినిమా చేస్తాడా అనే సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ వినాయక్, కోన వెంకట్ ‘అదుర్స్-2’ కోసం తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇటీవల ‘బ్యాండ్ మేళం’ మూవీ ప్రమోషన్స్ లో ‘అదుర్స్-2’ గురించి కోన వెంకట్ మాట్లాడాడు. అదుర్స్ సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని, ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక కలిసి స్టోరీ వినిపిస్తున్నానని చెప్పాడు. చెప్పడమే కాదు.. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు.

అదుర్స్-2 కథ వినడానికి కాస్త టైం ఇవ్వమని ఎన్టీఆర్ ని కోన వెంకట్ కోరినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కథ వింటాడా? విన్న తరువాత ‘అదుర్స్-2’ చేయడానికి ఓకే అంటాడా? అసలు ఈ సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: తెరపైకి చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్!

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird