

వైయస్సార్ కడప ఏర్పాటు భారతి సిమెంట్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం. కంపెనీ కోసం భూములు కోల్పోయిన గ్రామాల కుటుంబాలకు న్యాయం చేయాలని శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరపాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు మోహరించారు. భారతీ సిమెంట్స్ యాజమాన్యం ఉద్యోగాలు ఇచ్చిన జీతాలు సరిపోవడం లేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు తీసుకునేటప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని. ఈ సమస్యల కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ గేటు ముందు భాదిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లు మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగుతుందని బాధితులు.
