
[ad_1]

ప్రముఖ నటి మాధవీలత(మాధవి లత)కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది.
సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాధవీలతతో పాటు అనేక యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి పోస్ట్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. మాధవీలతతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మాధవీలతతో పాటు మిగిలిన యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లును సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!
అలాగే, ఇటువంటి పోస్ట్ లు పెడుతున్న పలు సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినా, అభ్యంతరకర పోస్టులు పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
[ad_2]