
[ad_1]

-ఎప్పుడు ఈ గోల తగ్గుతుంది
- క్షమాపణ చెప్పాడు కదా
-నీ మొగుడు కి చూపించుకో
-బాధ్యతగా ఉండక్కర్ల
సినిమాకి సంబంధించి జరిగే పబ్లిక్ ఫంక్షన్స్ లో ఆడవాళ్లు ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పిన శివాజీ మాటలు పలు విమర్శలకి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శివాజీ ఇప్పటికే క్షమాపణ చెప్పడమే కాకుండా తెలంగాణ మహిళా కమీషన్ ఎదుట హాజరై ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పడంతో పాటు తన పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఆ వ్యాఖ్యలపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా శివాజీపై పలు రీతుల్లో విమర్శలు చేసుకుంటూ వస్తూనే ఉంది.
ఇప్పుడు ఈ మొత్తం విషయంపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యా రెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతుంది ఒక మహిళగా, భారతీయ స్త్రీగా, తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నాను. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో రెండు పదాలు తప్పుగా ఉన్నాయి. ఈ సూచన శివాజీ అంగీకరించి క్షమాపణ. కానీ తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా అనసూయ అయన్ని టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదు. శివాజీ గారు ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అయినా అనసూయ ఓవరాక్షన్‌తో వీడియోలు, పోస్టులు చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పుడు అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై మాట్లాడుతున్నాను.
ఇది కూడా చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శరీరంలో భారీ మార్పులు.. నాన్ వెజ్ వల్లేనా!
ఆడది తన అందాన్ని ఇంట్లో మొగుడికి చూపిస్తే చాలు. బజారులో మగాళ్లందరికీ చూపించనక్కర్లేదు. స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదు. చదువు, ఉద్యోగం, అభిప్రాయం చెప్పే హక్కు ఇవే నిజమైన స్వేచ్ఛ. పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు, పురుషులు కొంత బాధ్యతతో ప్రవర్తించాలి. స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని రెచ్చగొట్టడం సరికాదు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో ఓ హీరోయిన్ ధరించిన డ్రస్సింగ్ వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ దృష్టిలో ఉంచుకునే శివాజీ ఒక అన్నగా, తమ్ముడికి సలహా ఇచ్చాడని సంధ్య రెడ్డిగా కనిపించాడు.

[ad_2]