
ఇండియాలో ఉండేది బాలీవుడ్‌దే పైచేయిగా. సౌత్‌కి చెందిన చిత్ర పరిశ్రమలు కొన్ని విషయాల్లో బాలీవుడ్‌పైనే ఆధారపడేవి. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన అనేక సినిమాలను సౌత్‌లో రీమేక్ చేసేవారు. మార్కెట్ పరంగా బాలీవుడ్ పరిధి ఎక్కువగా ఉంది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఒక్కసారిగా బాలీవుడ్‌ని పక్కనపెట్టి టాలీవుడ్ తన సత్తా ఏమిటో చాటుతోంది. అంతేకాదు, తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది.
తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో గూగుల్‌లో టాలీవుడ్ హీరోల సెర్కింగ్ కూడా అధికమైంది. 2025 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన హీరోలకు సంబంధించిన జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మొదటి ఆరు పేర్లూ టాలీవుడ్‌లో హీరోలవే కావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో బాలీవుడ్ హీరోల గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసేవారు. ఇప్పుడు అందులోకి టాలీవుడ్ హీరోలు వచ్చి చేరారు.
2025లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల గురించి, వాటిలో హీరోలుగా నటించిన వారి వ్యక్తిగత విషయాల గురించి, వారి నెక్స్‌ట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించినట్లుగా ఉన్నాయి. గూగుల్ సెర్చ్ జాబితాలో మొదటి స్థానంలో అల్లు అర్జున్ నిలవగా, రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగో స్థానంలో రామ్‌చరణ్, ఐదు, ఆరు స్థానాల్లో మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్ ఉన్నారు. బాలీవుడ్‌నే కాదు, గూగుల్ సెర్చ్‌ని కూడా ఆక్రమించిన టాలీవుడ్ హీరోలు ఇకపై మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
