
[ad_1]

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(మాస్టర్ మహేంద్రన్)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(నీలకంట)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహ ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతు 'నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా చేయాలని మూవీ "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైం లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. దీనితో కొద్ది రోజుల పాటు షూట్ ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలని దాటి మీ ముందుకు మా జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నారు.
డీవోపీ, ఎడిటర్ శ్రావణ్ జి.కుమార్ మాట్లాడుతూ నేను డైరెక్టర్ రాకేష్ స్నేహితులం. ఇక్కడే ప్రసాద్ లియాబ్స్ లో మా షార్ట్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ చేసేవాళ్లం. అప్పుడు ఒక మంచి సినిమా చేయడం కలగన్నాం. అది "నీలకంఠ" చిత్రంతో నిజమైనందుకు సంతోషంగా ఉంది. మా టీం అంతా పెట్టిన ఎఫర్ట్ తో ట్రైలర్ ఇంత క్వాలిటీగా వచ్చింది. సినిమా కూడా అంతే బాగా ఆకట్టుకుంటుందని చెప్పాడు.ప్రొడ్యూసర్ వేణుగోపాల్ దీవి మాట్లాడుతూ - మా "నీలకంఠ" సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్ కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర సమర్పకులు శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి మాట్లాడుతు నా సోదరుడి వల్లే నేను ఈ ప్రొడక్షన్ లోకి రావాల్సివచ్చింది. ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నాకు బాగా నచ్చింది. ట్రైలర్ ఉంటే నా లైఫ్ లో జరిగినవి గుర్తుకొచ్చాయి. మా చిత్రంలో ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. నేను స్కూల్ లో చదివే టైం నుంచి కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్ వంటి గేమ్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాను. బహుమతులు గెలుచుకున్నాను. బాక్సాఫీస్ గేమ్ లో కూడా ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించి మాకు కప్ప అందిస్తారనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
డైరెక్టర్ రాకేష్ మాధవన్(రాకేష్ మాధవన్)మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మా నిర్మాతలు శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి ఇతర భాషలకు కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ యష్న(యష్న)మాట్లాడుతూ - "నీలకంఠ" చిత్రంలో నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మేము ఒక విలేజ్ కు వెళ్లి అక్కడే లోకల్ టాలెంట్ ని సెలెక్ట్ చేశాం. వాళ్లు మా మూవీలో మంచి రోల్స్ చేశారు. ట్రైలర్ లో మీకు ఆ క్వాలిటీ పెర్ ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. జనవరి 2న మా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది .
హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రోత్సహించాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. మంచి ఫైట్స్, సాంగ్స్ కూడా ఉన్నాయి.అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" తో ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.
రాంకీ,శుభలేక సుధాకర్, 30 ఇయర్స్ పృథ్వీ, చిత్రం శ్రీను, అఖండ శివ, కంచరపాలెం రాజు, సురభి ప్రభావతి, సత్య ప్రకాశ్, కిరాక్ ఆర్పీ, భరత్ రెడ్డి, రాజు, అప్పాజీ, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఆర్ట్ - నాని పండు, సతీష్ శెట్టి, కొరియోగ్రాఫర్స్ - సాగర్, శివ గిరీష్, యాక్షన్ - రవి, డీవోపీ, ఎడిటింగ్ - శ్రావణ్ జి.కుమార్, మ్యూజిక్ మార్క్ - ప్రశాంత్
సమర్పణ - శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి, పీఆర్ఓ - సతీష్. కె.
[ad_2]