
డిసెంబర్ 26, 2025 5:43AMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు తోడు కొత్త నిర్మాణాలకూ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు మంత్రి నారాయణ గురువారం (డిసెంబర్ 25)శంకు స్థాపన చేశారు. ఈ ఐకానిక్ భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేసి ఈ సందర్భంగా చెప్పారు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మించినట్లు ఆయన రెండు బేస్‌మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. 52 కోర్టు హాళ్లు ఉంటాడు. ఇందు కోసం 45 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఒక చారిత్రక ఘట్టంగా మంత్రి నారాయణ అభివర్ణించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హైకోర్టు శాశ్వతమైన రాట్ ఫౌండేషన్ పద్ధతిని నిర్మించింది.
రాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. మొత్తం భవనం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం భారీగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం. ఇది భవనానికి పటుత్వాన్ని ఇస్తుంది.
