
డిసెంబర్ 25, 2025 11:48PMన పోస్ట్ చేయబడింది

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్ర కమిటీ (మావోయిస్టు) నిషేధిత అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే అలియాస్ పాకా హనుమంతు భద్రతా బలగాలతో ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా ప్రాంతం గురువారం (డిసెంబర్ 25) ఒడిశా ప్రత్యేక గ్రూప్ , సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ ఆపరేషన్ సంయుక్తంగా నిర్వహించిన కూబింగ్ ఆపరేషన్ ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల మహిళా నక్సల్స్‌లో కూడా ఇద్దరు అధికారులు తెలిపారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఒక పోతే ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన గణేష్ ఉయికే సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గణేష్ ఉయికేపై . మొత్తం కోటి రూపపాయల రివార్డు ఉండగా, తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా పాతిక లక్షల రివార్డు ప్రకటించింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లా చందూర్ మండలం పుల్లెమ్ల గ్రామానికి చెందిన గణేష్ ఉయ్యి, బీఎస్సీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి, క్రమంగా వివిధ బాధ్యతలు నిర్వహించి అగ్రస్థాయి నేతగా ఎదిగారు.
ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో మిగిలి ఉన్నది కేవలం ముగ్గురు సభ్యుల్లో గణేష్ ఉయికే ఒకడిగా భద్రతా సంస్థలు గుర్తించబడ్డాయి. మిగిలిన వారిని ఛత్తీస్‌గఢ్‌లో మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, జార్ఖండ్‌లో అనాల్డా అలియాస్ తూఫాన్ మాత్రమే.
ఇదిలా ఉండగా, మావోయిస్టు పాలిట్‌బ్యూరో సభ్యుల్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిషిర్ బేస్రా ఇంకా పరారీలో ఉన్నారు. మరోవైపు, పాలిట్‌బ్యూరో సభ్యులు వేణుగోపాల్ రావు అలియాస్ సోను, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న ఇప్పటికే లొంగిపోయారు.
గణేష్ ఉయికే హతంతో ఒడిశా, పరిసర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భద్రతా దళాలు చెబుతున్నాయి.ఇలా ఉండగా గణేష్ ఉయికే ఎన్ కౌంటర్ పై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో నక్సల్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చి 31లో దేశంలో మావోయిజంను పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.
