
డిసెంబర్ 25, 2025 11:33AMన పోస్ట్ చేయబడింది

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 101 జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. భారత జాతి గర్వించదగ్గ నేతగా చంద్రబాబు వాజ్ పేయిని అభివర్ణించారు.
అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా అమరావతిలో వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాజ్ పేయితో కలిసి పని చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ, దేశానికి ఆయన సేవను ప్రస్తుతిస్తూ ట్వీట్ చేశారు. గతంలో ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఆ పోస్టుకు జత చేశారు.

