Home Latest News బాంబు బెదరింపు.. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ | బాంబు బెదిరింపు విమానం అత్యవసర ల్యాండింగ్| శంషాబ్స్| విమానాశ్రయం| సౌదీ – ACPS NEWS

బాంబు బెదరింపు.. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ | బాంబు బెదిరింపు విమానం అత్యవసర ల్యాండింగ్| శంషాబ్స్| విమానాశ్రయం| సౌదీ – ACPS NEWS

by Admin_swen
0 comments
బాంబు బెదరింపు.. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ | బాంబు బెదిరింపు విమానం అత్యవసర ల్యాండింగ్| శంషాబ్స్| విమానాశ్రయం| సౌదీ

డిసెంబర్ 25, 2025 9:15AMన పోస్ట్ చేయబడింది


బాంబు బెదరింపుతో ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం (డిసెంబర్ 25) ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.

ఆ తరువాత విమానంలోని ప్రయాణీకులను దించివేసి బాంబ్ స్క్వాడ్ తో విమానంలో తనిఖీలు జరిగాయి. ఇటీవలి కాలంలో విమానాలలో బాంబులు పెట్టామంటూ బెదరింపు ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తరహా బెదరింపులు ఇటీవలి కాలంలో దాదాపు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. తాజాగా మరోమారి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird