
డిసెంబర్ 24, 2025 11:05AMన పోస్ట్ చేయబడింది

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. అజీర్ణం పెరగకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్స్ బయటకు పోవడానికి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బరువు బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం తాగుతారు. అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే..
రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం..
నిమ్మకాయ నీరు క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవానికి చాలా పెద్ద నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వైద్యులు ఏం చెప్తున్నారు?
చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిని దెబ్బతీసే ఏదైనా అలవాటును ఉత్పత్తి చేయడానికి నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
ఎలక్ట్రోలైట్ అంటే..
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్, బైకార్బోనెట్ వంటి వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు. ఈ ఖనిజాలు శరీరానికి ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి గుండె పనితీరుతో పాటు వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యవంతులు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సరిగ్గా ఉండాలి.
ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత..
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, పనితీరు దెబ్బతింటుంది. కండరాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల తలనొప్పి, గుండె లయ గందరగోళంగా ఉండటం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.