

సినిమా పేరు: దండోరా
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, మణిక, అదితి భావరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్‌మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
రచన, దర్శ’క’త్వం: ముర’ళీకాంత్ దేవ సోత్
ప్రచార చిత్రాల ద్వారా మూవీ లవర్స్ లో, ప్రేక్షకుల్లో మంచి బజ్ ని సంపాదించుకున్న చిత్రం ‘దండోరా’. నటుడిగా రీ ఎంట్రీ లో తన జైత్ర యాత్రని కొనసాగిస్తున్న శివాజీ ‘దండోరా’కి స్పెషల్ ఎట్రాక్షన్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. (దండోరా మూవీ రివ్యూ)
కథ
శివాజీ(శివాజీ) తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న తుళ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఆర్థికంగా స్థితిమంతుడేమి కాదు. కానీ నరనరాన కుల అభిమానాన్ని నింపుకుని ఉంటాడు. కొడుకు పేరు విష్ణు(నందు). హైదరాబాద్ నగరంలో మున్సిపల్ ఆఫీస్ లో పని చేస్తున్నాడు. విష్ణుకి భార్య(మౌనిక రెడ్డి), తొమ్మిదో తరగతి చదివే కూతురు ఉంటారు. శివాజీ, విష్ణు మధ్య చాలా సంవత్సరాల నుంచి మాటలు లేవు. శివాజీ కూతురు పేరు సుజాత (మణిక). రవి(రవికృష్ణ) మంచి మనసు గల అట్టడుగు వర్గానికి చెందిన యువకుడు. డబ్బు, చదువు విషయంలో శివాజీ కుటుంబం కంటే రవి కుటుంబానికే ఎక్కువ పరపతి ఉంది. సుజాత, రవి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. సీతారామ్(నవదీప్) ఊరి ప్రెసిడెంట్. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలని చిన్నతనం నుంచే పుణికి పుచ్చుకున్న వ్యక్తి. శ్రీలత(బిందుమాధవి) వేశ్య వృత్తి చేసుకుంటూ బతికే అందమైన అతివ. ఆమె కూతురు పేరు సుజాత(రాధ్య). చిన్నతనంలోనే తండ్రిని చంపి జైలుకి వెళ్లి వచ్చిన అమ్మాయి. పైన చెప్పుకున్న ఈ క్యారక్టర్ ల చుట్టు అల్లుకున్న మంచి, చెడు, ప్రేమ, అభిమానం,స్నేహం, బాధ, సంతోషం, భావోద్వేగం, ఈర్ష్య, అసూయ, ఆశయం, నీతి వంటి అంశాల సమూహమే దండోరా.
ఎనాలసిస్
ఇలాంటి కథలు సెల్యులాయిడ్ పై గతంలో చాలానే వచ్చాయి. కానీ దండోరా ఆ ఛాయల అంచుని టచ్ చేస్తూ మరో అద్భుతమైన పాయింట్ కి సరికొత్త కథనంతో వచ్చింది. దీంతో కొత్తదనాన్ని ఫీల్ అవుతాం. ఎన్నో జీవిత సత్యాలని కూడా చెప్పింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తో పాటు శివాజీ క్యారక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ప్రధాన ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ప్రధాన బలంగా నిలిచాయి.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం 2004 ,2014 మధ్య జరిగే కథగా రివర్స్ స్క్రీన్ ప్లేతో స్టార్ట్ అయ్యింది. మొదటి సీన్ తోనే మూవీలో లీనమైపోతాం కూడా. శివాజీ, విష్ణు, రవి, సుజాత క్యారక్టర్ ల మధ్య వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగా కలిసి నాచురల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. ఒక శవంకి సంబంధించిన వ్యక్తి గత జీవితం బాగానే ఎలివేట్ అయ్యింది. కాకపోతే ఎంటర్ టైన్ కి సంబంధించిన డైలాగ్స్, సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ధ పడాల్సి వచ్చింది. బలగం మూవీ సంచలన విజయాన్ని సాధించడానికి.. సెంటిమెంట్ తో పాటు పారలాల్ గా నడిచిన ఎంటర్ టైన్ మెంట్ కూడా ఒక కారణం అని తెలుస్తోంది.
రవి, సుజాత మధ్య వచ్చిన లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడానికి కూడా సుజాత పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ సందర్భంగా వచ్చే సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. దీని ద్వారా తెలంగాణలోని పల్లెల్లో ఉంటే చాలా మంది అమ్మాయిల మెంటాలిటీతో ముడిపడి ఉన్న ఆత్మాభిమానాన్ని తెలియచేస్తుంది. కాకపోతే ఆ లవ్ కి శివాజీ అడ్డు వస్తాడని ముందుగానే అర్ధం అవుతుంది కాబట్టి, రవిని శివాజీ కులానికే చెందిన వ్యక్తిగా చీట్ చేయవలసి ఉంటుంది.
శివాజీ, అతని ఫ్రెండ్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. తమ వ్యక్తిగత పగని కుల పగగా మార్చే వారు ఉంటారనే నిజాన్నికూడా చూపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా ఊహించిందే. టోటల్ గా ఫస్ట్ హాఫ్ బెటర్ అనే స్థాయిలో ఉంది. దీనితో సెకండ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి తగ్గట్టే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో సాగింది. ఎంతలా అంటే ఎన్నో సీన్స్ బావోద్వేగానికి గురి అవుతున్నాయి. సగటు మనిషి మైండ్ సెట్ ని కూడా తెలియచేసింది.
శివాజీ, శ్రీలత మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు శ్రీలత గత జీవితం కూడా ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా శివాజీ తన కూతురుకి సంబంధించిన చిన్న వయసు ఫొటోస్ నుంచి యుక్త వయసులో ఉన్నఫొటోస్ ని చూసి ఏడ్చే సన్నివేశాలు, కోర్టు సన్నివేశాలు మనకి తెలియకుండానే కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ సన్నివేశాలతో కులతత్వాన్ని ఓవర్ గా నింపుకున్న ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మార్పు రావడం ఖాయం. శ్రీలత కూతురుకి సంబంధించిన సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రధాన బలంగా నిలిచాయి. కాకపోతే మంచోళ్ళు, చెడ్డోళ్లు అన్ని కులాల్లోనూ ఉంటారనే విషయాన్నీ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
మొదట్లోనే చెప్పుకున్నట్టు ఎవరిని కాదు అందరు తమ క్యారెక్టర్స్ లో జీవించారు. ముఖ్యంగా శివాజీ పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శివాజీ కి అవార్డు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తనలోని భావాలని అణుచుకొని బతుకుతుండే వ్యక్తిగా నందు, ఊరి ప్రెసిడెంట్ గా నవదీప్ మైండ్ బ్లోయింగ్ పెర్ ఫార్మెన్స్ ని ఇచ్చాడు. ఆ ఇద్దరు ఈ తర్వాత చిత్రం మరింత మారడం గ్యారెంటీ. మణిక చిక్కాల కూడా అందుకు అర్హురాలైన పెర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. ఇక ఒకప్పటి హీరోయిన్ బిందు మాధవి కూడా అంతే. అద్భుతమైన నటనతో నటి శ్రీలత క్యారక్టర్ ని మాత్రమే కనపడేలా చేసింది. శివాజీ గా చేసిన కమల్ తో పాటు మిగిలిన ఫ్రెండ్ నటినటులు కూడా తమ క్యారెక్టర్ పరిధి మేరకు మెప్పించారు.
నిర్మాణ విలువల్లో భారీతనం లేకపోయినా ‘వెంకట్ శాఖమూరి’ అద్భుతమైన ఫొటోగ్రఫీ ఆ లోటుని తెలియకుండా చేసింది. ప్రతి చిత్రం మన కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంది. దర్శక, రచయిత మురళి కాంత్ గురించి చెప్పుకుంటే దర్శకత్వంలో మెరుపులు లేకపోయినా రచయితగా మాత్రం కట్టిపడేసాడు. నటినటుల దగ్గర్నుంచి మంచి పెర్ ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో భారీగా సక్సెస్ అయ్యాడు. మార్క్ కె.రాబిన్ నుంచి వచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దండోరాని ఇంకో మెట్టు పైకి ఎక్కించాయి.
ఫైనల్ గా చెప్పాలంటే..
అహంకారం, అజ్ఞానం, మూర్ఖత్వంతో కళ్ళు మూసుకొని పోతే నిజమైన అభిమానాన్ని, ప్రేమని ఎలా దూరం చేసుకుంటామో దండోరా చెప్పింది. తరతరాలుగా చాలా గ్రామాల్లో జరుగుతున్న ఒక ప్రధాన పాయింట్ ని కూడా ఎంతో ధైర్యంగా చెప్పింది.
రేటింగ్: 2.75/5
– అరుణాచలం
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.
