
డిసెంబర్ 23, 2025 7:21AMన పోస్ట్ చేయబడింది

ఎడారిలో వర్షం పడటమే వింత అనుకుంటే..ఏకంగా మంచు వర్షమే కురిసింది. ఔను సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ఉంది.
ఏడారిలో వర్షాలు, మంచు కురవడం వావావరణ మార్పులకు నిదర్శనంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిత్యం భగభుగలాడే వేడిమితో ఉండే ఎడారి దేశం సౌదీ ఇప్పుడు చలికి గజగజలాడుతోంది. ఉత్తర, మధ్య ప్రాంతాలకు చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని వాతావరణ కేంద్రం. రానున్నరోజులలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని చరించింది.
