

తారాగణం: ఇషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు, తులసి చేశారు
దర్శకత్వం: కబీర్ లాల్
ఓటీటీ: సన్ నెక్స్ట్
ప్రేమ కావాలి, పూల రంగడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఇషా చావ్లా.. కాస్త విరామం తర్వాత చేసిన సినిమా ‘దివ్య దృష్టి’. టైటిల్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (దివ్య దృష్టి రివ్యూ)
కథ:
భవ్య, దివ్య (ఇషా చావ్లా) ట్విన్ సిస్టర్స్. వీరికి ‘డిజెనరేటివ్ ఐ డిసీజ్’ ఉంటుంది. దీని వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోతారు. మొదట భవ్య కంటిచూపు కోల్పోతుంది. అయితే అనూహ్యంగా ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోతుంది. భవ్యది ఆత్మహత్య అని అందరూ నమ్ముతారు. దివ్య మాత్రం ఇది హత్యే అనే అనుమానంతో.. తానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ విషయంలో తన భర్త(కమల్ కామరాజు) నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదు. మరోవైపు తన కంటి చూపు కూడా తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దివ్య రిస్క్ చేసి, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ ఆమెకు తెలిసిన నిజాలేంటి? భవ్య మరణానికి కారణం ఎవరు? దివ్యను వెంటాడుతున్న అదృశ్య వ్యక్తి ఎవరు? ఇందులో సునీల్ పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
దివ్య దృష్టి.. టైటిల్ బాగుంది.. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. త్వరలో కంటిచూపు కోల్పోనున్న ఒకమ్మాయి.. తన సోదరి మరణం వెనకున్న మిస్టరీ తెలుసుకోవాలి అనుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో.. అసలు దీని వెనుక ఎవరున్నారు? తర్వాత ఏం జరగనుంది? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చునేలా చేయవచ్చు. కానీ, ఆ విషయంలో దివ్య దృష్టి టీమ్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
దివ్య ఒక ఈవెంట్‌లో ఉండగా.. కంటిచూపు లేని భవ్య, తాను అపాయంలో ఉన్న సమయంలో తెలపడం కోసం సోదరికి కాల్ చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఉరి వేసుకొని చనిపోతుంది. దీనితో ఇంట్రెస్టింగ్ గానే సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే సినిమాకి కీలకమైన ఇన్వెస్టిగేషన్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. చాలా సీన్స్ ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయడానికే అన్నట్టుగా ఉన్నాయి. ఆ విషయం చూస్తే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది.
అదృశ్య వ్యక్తి ట్రాక్ కూడా అంత ప్రభావవంతంగా లేదు. ఆ వ్యక్తి చాలా డేంజర్ అన్నట్టుగా మాటల్లో చెప్పాడు కానీ.. అతను రివీల్ అయ్యాక దానికి తగ్గ సన్నివేశాలు పడలేదు. పైగా ఆ ట్రాక్ కాస్త గందరగోళంగానూ ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ లో సినిమా స్టార్టింగ్ సీన్స్ తర్వాత, కాస్త ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ తో తాజా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో సినిమా పుంజుకుంది. అయితే విలన్ ని రివీల్ చేసే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.
ఇన్వెస్టిగేషన్ సీన్స్ సిల్లీగా, హీరోయిన్ కి అన్నీ కన్వీనెంట్ గా జరిగినట్టుగానే ఉంటాయి. అలాగే, ఒక చిన్న పాప వచ్చేసి.. ఇతనే విలన్ అని రివీల్ చేసి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పేయడం కూడా సిల్లీగా ఉంది.
హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే.. ఆమె థ్రిల్ అవ్వడమే కాకుండా, చూస్తే ఆడియన్స్ కూడా థ్రిల్ అవ్వాలి. కానీ, ఇందులో హీరోయిన్ పెద్దగా కష్టపడకుండానే.. అందరూ ఆమెకి అన్నీ విషయాలు చెబుతారు. దాంతో కిక్ లేకుండా పోయింది. అదే సినిమాకి మైనస్ అయింది.
టెక్నికల్ గా కూడా సినిమా గొప్పగా లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు కీలకమైన కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగం పనితీరు సోసో గానే ఉంది.
ఫైనల్ గా..
దివ్య దృష్టి.. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ, దానిని తెరపైకి ఆసక్తికరంగా తీసుకురావడంలో తడ కనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు.. అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ట్రై చేయొచ్చు.
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.
