
డిసెంబర్ 22, 2025 10:28AMన పోస్ట్ చేయబడింది

పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. మాచర్ల నియోజకవర్గం అడిగొప్పలలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరాంమూర్తిలపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతుడిని హత్య చేయగా, అదే గ్రామంలో నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తిని హత్య చేశారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
