
డిసెంబర్ 22, 2025 9:12AMన పోస్ట్ చేయబడింది

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టి20లలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన టి20 మ్యాచ్‌లో పాతిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. మొత్తంగా టి20 ఫార్మాట్‌లో నాలుగువేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 పరుగులతో తొలి స్థానంలో ఉంది. స్మృతి మంధాన 154 మ్యాచుల్లో 4007 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలను పరిగణలోకి తీసుకుంటే ఇంత వరకూ స్మృతి మంధానతో కలిసి ఐదుగురు మాత్రమే ఈ ఫార్మాట్‌లో నాలుగువేల పరుగుల మైలురాయిని దాటారు. ఇండియా నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారి సరసన స్మృతి మంధాన చేరింది. ఈ ముగ్గురూ కాకుండా బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం మాత్రమే ఈ ఫార్మాట్‌లో నాలుగువేలు అంతకు మించి పరుగులు చేశారు. ఇలా ఉండగా ఈ జాబితాలో అందరి కంటే పిన్న వియస్కురాలు స్మృతి మంధాన మాత్రమే కనిపించడం.
