
డిసెంబర్ 18, 2025 2:35PMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలోనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈసారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు.
నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీ, జలవనరులశాఖ మంత్రి సిఆర్ పాటిల్‌తో పోలవరంతో భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు ప్రాజెక్టులకు అవసరమైన బాయిలు వెంటనే విడుదల చేయాల్సిన ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరింది.
