
డిసెంబర్ 18, 2025 2:51PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన అధికారాన్ని కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ ఉనికిలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ తెగ వైరల్ అయ్యింది.
ఇదేంటి ఎన్నికలు తెలంగాణలో ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ పంచాయతీ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్నాథం. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి. ఈ ఎన్నికల్లో భూక్య చంద్రబాబు బానోత్ జగన్నాథమ్ బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు. తెలంగాణలో నెటిజనులు కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.