
డిసెంబర్ 18, 2025 7:23PMన పోస్ట్ చేయబడింది
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారణకు అనుమతించిన విషయం తెలిసిందే… ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు ఆయన దాటవేస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విచారణ రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతిని అందించారు. మరోసారి సుప్రీంకోర్టును కోరే అవకాశ ముందని సమాచారం. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.
