
డిసెంబర్ 17, 2025 12:04PMన పోస్ట్ చేయబడింది
.webp)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఎన్టీఆర్ రాజు బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూశారు. ఎన్టీఆర్ రాజు మరణంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ రాజు ఇద్దరు పర్యాయాలు టీటీడీబోర్డు సభ్యునిగా అంకిత భావంతో సేవలందించారు.
రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు. ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా తిరస్కరించి, జన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు .పదవుల కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది.