

-ఈ న్యూస్ నిజమేనా!
-ఎవరు ఆ సూపర్ స్టార్
-ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా!
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద మాన్ ఆఫ్ మేసెస్ ‘ఎన్టీఆర్'(ఎన్టీఆర్)కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ గురించి తెలుసుకోవచ్చు. ఎలాంటి క్యారక్టర్ నైనా అవలీలీగా పోషించే ఎన్టీఆర్ సదర్ క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం యాదుండేలా చెయ్యడంలో తిరుగులేని మిస్సైల్. ప్రీవియస్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2′(వార్ 2)నే రీసెంట్ ఉదాహరణ. ఆశించినంత స్థాయిలో ఫలితం రాకపోయినా ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు బాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ ,ప్రేక్షకులు అతీతులేమి కాదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరో హిందీ సినిమాలో చేయబోతున్నాడనే వార్తలు ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి.
వార్ 2 ని సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘యష్ రాజ్'(యష్ రాజ్)సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ 2023లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(షారూఖ్ ఖాన్)తో స్పై థ్రిల్లర్ జోనర్ లోనే ‘పఠాన్’ అనే మూవీని నిర్మించింది. షారుక్ ని వరుస పరాజయాల నుంచి గట్టెక్కించిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ని తెరకెక్కించే ఆలోచనలో యష్ రాజ్ ఉన్నట్లు టాక్. ఆలోచనలో ఉండటమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా బిటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లోనే ఎన్టీఆర్ ని కూడా షారుక్ తో కలిసి చేయించాలనే పట్టుదలతో యష్ రాజ్ ఉన్నట్టుగా క్రిటిక్స్ చెప్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ని సంప్రదించారనే టాక్ కూడా జోరుగానే వినపడుతుంది.
ఇది కూడా చదవండి: భార్యకి క్యాన్సర్, నాలుగు సర్జరీలు.. రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న షరీబ్
ఇంకొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలైతే స్పై యూనివర్స్ లో భాగంగా యష్ రాజ్ ఆ తరహా చిత్రాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా వాళ్ళు ప్రదర్శించిన సినిమాలని మరో మూవీకి లింక్ చేస్తున్నారు. ఈ కోవలోనే ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్(సల్మాన్ ఖాన్)’టైగర్’ గా గెస్ట్ క్యారక్టర్ లో కనపడ్డాడు. ఈ కోవలోనే ఎన్టీఆర్ కూడా వార్ 2 లో నటించిన మేజర్ రఘు విక్రమ్ చలపతి గా పఠాన్ 2 లో గెస్ట్ గా కనిపిస్తాడనే విషయాన్నీ చెప్తున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో వెయిట్ చేస్తే గాని తెలియదు.

