
డిసెంబర్ 15, 2025 3:29PMన పోస్ట్ చేయబడింది

హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.
