
డిసెంబర్ 15, 2025 9:58AMన పోస్ట్ చేయబడింది

ఘర్షణ ఆపడానికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ టోలీచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 14) రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పరమౌంట్ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో టోలిచౌక్ కుంట విరాట్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ తన తమ్ముడు అదనాన్ బిలాల్ లమధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుసునని ఆ గొడవ ఆపడానికి అక్కడకు వెళ్లాడు. అయితే చినికి చినికి గాలి వాన అయినట్లుగా ఆ గొడవ కాస్త పెద్దదైంది.
బిలాల్ ఒక్కసారిగా ఇర్ఫాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మరణించాడు. సమాచారం అందుకున్న టోలిచౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు, గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో పరమౌంట్ కాలనీలో ఉద్రిక్తత. ఆపడానికి వెళ్లిన కొడుకు తిరిగి రాణి లోకానికిపోవడంతో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.