
డిసెంబర్ 13, 2025 2:58PMన పోస్ట్ చేయబడింది

కృష్ణా జిల్లాలో కారకంపాడు గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడకు తిరిగి వెళ్తున్న సమయంలో రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.గ్రామ రైతులు మాట్లాడుతూ... ధాన్యం పై పొర రంగు మారడానికి కారణం రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ఈ పరిస్థితికి అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రికి తెలిపారు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపించి విచారణ జరిగింది. వ్యాపారస్తులు ధాన్యం రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పినా, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్లు మంత్రి పరిశీలనలో తేలింది. దీంతో రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నట్లు స్పష్టమైంది. మంత్రి ప్రకారం మాయిశ్చరైజర్ యంత్రాన్ని పరీక్షించి ధాన్యాన్ని పరీక్షించగా, పై పొరలో రంగు మారడానికి లోపల బియ్యం నాణ్యత పూర్తిగా ఉందని నిర్ధారణ అయింది.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్, డీఎం సహా సంబంధిత ఫోన్లో మాట్లాడిన మంత్రి, తక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో న్యాయమైన రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.