
డిసెంబర్ 13, 2025 3:52PMన పోస్ట్ చేయబడింది

నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నట్లైంది. కీలక నేతలు పార్టీని వీడుత మాజీ సీఎం జగన్ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శనివారం (ఈ నెల 13)ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడలో కరీముళ్లకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మరో ఇద్దరు నేతలతో టచ్‌లో కనిపిస్తున్నాయి. ఆనీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ఇద్దరి ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.