
డిసెంబర్ 12, 2025 4:44PMన పోస్ట్ చేయబడింది

భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొ. అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు.
