
డిసెంబర్ 11, 2025 2:31PMన పోస్ట్ చేయబడింది
.webp)
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట ఉదయం 11 గంటల లోపు లొంగిపోవాలని విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం అందించింది. 14 ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి రోజులు ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతనెల.. నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేరు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడింది. చివరగా ఈ రోజు.. అంటే గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది
