
డిసెంబర్ 11, 2025 2:42PMన పోస్ట్ చేయబడింది

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి చుట్టూ మరి ఇన్ని అవినీతి బాగోతలా? మొన్న లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం, నిన్న పరకామణి ఇష్యూ.. తాజాగా పట్టు వస్త్రాల అవినీతి బండారం.
పాపం ఆ వెంకన్న ఇంత పెద్ద నామాలతో కళ్లు మూసుకుని ఉంటారు కాబట్టి వీరిష్టానికి వీరు యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. ఆయన నిజ నేత్ర దర్శన సమయంలో ఈ అవినీతి బండారం ఎవరో ఒకరి రూపంలో బయట పడేస్తున్నారు.
ఇంతకీ తాజా వ్యవహారంలో ఎవరూ, ఏంటని చూస్తే.. పదేళ్ల కాలంలో అంటే, 2015- 25 మధ్య కాలంలో కేవలం పట్టు కండువాల కుంభకోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. శ్రీవారు రాత్రింబవళ్లు కాళ్లు నొప్పులు పుట్టేటట్టు నిలుచుకుంటారు. ఇక’ జనం బాధలు విని, చెవులు చిల్లులు పడేలాంటి పరిస్థితి. వారి కష్ట’న’ష్టాల’న్నీ విని వారి ఆర్త’నాదాల’న్నీ తీర్చినందుకుగానూ కానుక’ల రూపంలో రోజూ కోటి రూపాయ’లకు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా అలరారుతుంటారు.
అలాంటి దేవుడి సొమ్ము ఎలాగైనా సరే కాజేయాలన్న ఆలోచన కొద్దీ.. కొందరు అవినీతి పరులు ప్రతి చిన్న విషయానికీ.. పెద్ద పెద్ద టెండర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి దగ్గరకు వచ్చే ప్రముఖులకు ఒక శేష వస్త్రం కప్పడం ఆచారం.
అయితే స్వామివారి స్థాయికి తగ్గట్టు, ఈ వస్త్రం పట్టుగా ఉండాలని భావించి నగరిలోని ఒక సంస్థకు ఈ కాంట్రాక్టు అప్పగించగా.. ఈ సంస్థ గత కొంత కాలంగా వందలు కూడా చేయని పట్టు వస్త్రానికి పదమూడు వందలకు పైగా వసూలు చేస్తోంది. సరే ఇదేమైనా ప్యూర్ మల్బరీ పట్టా? అని చూస్తే.. అది కూడా కాద’ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంది.. పాలిస్టర్- పాలిస్టర్ గా రిపోర్టులొచ్చాయి. ఈ ఏడాది కూడా ఈ వస్త్రం 15 వేల ఆర్డర్లు ఇచ్చింది టీటీడీ.
ఇదేలా బయట పడిందో చూస్తే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక పట్టు వస్త్రం కొనగా దాని ధర 400 వందల రూపాయలు కూడా లేవు. ఈ విషయం గుర్తించిన నాయుడు టీటీడీ కొంటోన్న పట్టు పై కండువా ఎంతుందో పరిశీలిస్తే 1300 కి పైగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన ఈ పట్టుబండారం మొత్తం బయటకు కూలీ లాగగా ఇక్కడ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జరిగినట్టు తెలిసింది.
ఇలా శ్రీవారి విషయంలో ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక అవినీతి మయంగా మారడం చూస్తుంటే.. ఇందుకంటూ ఒక అంతు లేదని తెలుస్తోంది. భక్తులు తామేసిన డబ్బు ఎలాంటి అవినీతిపరుల పాలవుతుందో అన్న ఆందోళనకు గురవుతున్నారు.
అలాగని ఇదేం ఎక్కడో ఉండే బోలే బాబా వంటి నకిలీ నెయ్యి సరఫరా చేసే సంస్థ కాదు.. దగ్గర్లోనే ఉండే నగరిలోని వీఆర్‌ఎస్ అనే సంస్థ. ఈ ప్రాంతంలో స్వామి వారి పట్ల ఎన్నో భయభక్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంకన్న అంటే భయం భక్తీ లేక పోవడమూ ఒక చర్చనీయంశంగా తయారైంది.
