
డిసెంబర్ 9, 2025 8:55AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17వ తేదీన జరిగింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలిపోయిన టైర్ ను మార్చి వాహనాన్ని సిద్ధం చేశారు. అలాగే వాహనానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు చేర్చి మళ్లీ కాన్వాయ్‌లో చేర్చారు. రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి అపాయం కలగడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.
