
డిసెంబర్ 8, 2025 1:57PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ రంగారెడ్డి జిల్లా కందుకూరులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ సమితులను నిర్వహిస్తోంది.
ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతు వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందని గవర్నర్ ఆశభావం వ్యక్తం చేశారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
గ్లోబల్ సమ్మిట్ జరిగే ఫ్యూచర్ సిటీ డ్రోన్ వీడియో ఆకట్టుకుంటోంది. తెలంగాణలో భారీ పెట్టుబడుల కోసం ఈ సమ్మిట్ కొనసాగుతోంది. మరోవైపు రైజింగ్ సమ్మిట్‌లో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతుంది అన్నపూర్ణ స్టూడియోస్‌ని కూడా చర్ సిటీకి తీసుకొస్తామని ఫ్యూజ్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని నాగ్ ఉంది. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.
ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయడం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సమ్మిట్ స్టాళ్లను పరిశీలించారు.ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీనటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు.
