

ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై ఆకలి దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.
సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
నటి కిడ్నాప్, దాడి కేసులో పోలీసులు పది మందిపై కేరళ కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తునకు కూడా దిలీప్ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.
అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్‌ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజాగా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించారు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
