Home Latest News భారత్ అంటే…పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయముందంటే! | భారత్‌పై పుతిన్‌ అభిప్రాయం? వ్లాదిమిర్ పుతిన్|పుతిన్ ఇండియా సందర్శన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| US ఆంక్షలు| పుతిన్ భారత పర్యటన| భారతదేశం రష్యా సంబంధాలు|నరేంద్ర మోదీ|ద్రౌపది ముర్ము| హైదరాబాద్ హౌస్ డిఫెన్స్ సహకారం| శక్తి సహకారం| ప్రాంతీయ భద్రత – ACPS NEWS

భారత్ అంటే…పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయముందంటే! | భారత్‌పై పుతిన్‌ అభిప్రాయం? వ్లాదిమిర్ పుతిన్|పుతిన్ ఇండియా సందర్శన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| US ఆంక్షలు| పుతిన్ భారత పర్యటన| భారతదేశం రష్యా సంబంధాలు|నరేంద్ర మోదీ|ద్రౌపది ముర్ము| హైదరాబాద్ హౌస్ డిఫెన్స్ సహకారం| శక్తి సహకారం| ప్రాంతీయ భద్రత – ACPS NEWS

by Admin_swen
0 comments
భారత్ అంటే...పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయముందంటే! | భారత్‌పై పుతిన్‌ అభిప్రాయం? వ్లాదిమిర్ పుతిన్|పుతిన్ ఇండియా సందర్శన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| US ఆంక్షలు| పుతిన్ భారత పర్యటన| భారతదేశం రష్యా సంబంధాలు|నరేంద్ర మోదీ|ద్రౌపది ముర్ము| హైదరాబాద్ హౌస్ డిఫెన్స్ సహకారం| శక్తి సహకారం| ప్రాంతీయ భద్రత

5 డిసెంబర్, 2025 4:50PMన పోస్ట్ చేయబడింది


పుతిన్ భార‌త్ వ‌చ్చినపుడు ఒక ప్రయివేటు వ్యూ కి ఇచ్చిన ఇంట‌ర్‌లో.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు. ఆ ప్ర‌శ్న‌లేంటి స‌మాధానాలు ఎలాంటివ‌ని చూస్తే..మీరు 25 ఏళ్లుగా రష్యాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన రికార్డు. ఈ దీర్ఘకాల పాలనా రహస్యమేంటని అడగ్గా..

అందుకు స’మాధానం చెప్పిన పుతిన్.. రహస్యం ఏమీ లేదు. ప్రజలు మ’న ప’ట్ల’ నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 1990లలో రష్యా పతనమైంది – ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా. ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు. నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను. అంతే అంటూ ఎంతో క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు సింపుల్‌గా తేల్చేశారు పుతిన్.

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఆయనతో రెండు సార్లు కలసి పనిచేశారు. ఈసారి రష్యా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు..

పుతిన్ ఇచ్చిన ఆన్సరేంటే.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు లాభనష్టాలు అర్థమవుతాయత’ప్ప ఈ పోరాటాలు యుద్ధాల ప’ట్ల ఆయ‌న’కేమంత ముక్కువ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం? ఏమీ లేదు – డబ్బు వృథా అవుతోంది. యూరప్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటార’నే అనుకుంటున్నా అన్నారు.. రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారని, ఆ దిశలో అడుగులు వేస్తారు. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామ ని కుండ బద్దలు కొట్టేశారు పుతిన్.

ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు? అనడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పుతిన్.. యుద్ధం మా చ‌యిస్ కాద‌న్నారు. 2014లో కీవ్‌లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా – ఉక్రెయిన్‌ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటును నమ్మమని కోరుకోవడం లేదు – వాళ్లే ఆ మాట చెప్పారు కదా! అని ప్రశ్నించారు. పుతిన్. ఇప్పుడు మా షరతులు స్పష్టం: ఉక్రెయిన్ నిరాయుధీకరణ, నాటోలో చేరకపోవడం, రష్యన్ భాషా హక్కులు, క్రిమియా మరియా నాలుగు ప్రాంతాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు. ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుందని తేల్చి చెప్పారు పుతిన్..

భారత్-రష్య సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ కొనసాగుతోంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని అడగ్గా.. అందుకు పుతిన్ ఏమన్నారంటే..

ఎంత మాత్రమూ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌న్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ – ఇది భారత దేశ స్వభావం. భారత్ ఎప్పుడూ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 1971లో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చవకగా చమురు కొంటున్నారు, మేము మీ నుంచి మందులు, టెక్నాలజీ కొంటున్నాం – ఇది పరస్పర లాభం. ఇది దోస్తీ కాదు, వ్యాపారం సరిగ్గా అదే స’మ’యంలో వ్యూహాత్మక సహకారంగా చెప్పుకొచ్చారు పుతిన్.

చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఇది భారత్‌ను ఆందోళన కలిగించే అంశం కదా? అని ప్ర‌శ్నించిన‌ పుతిన్ ఇందుకెలాంటిపుడు ఆన్స‌రిచ్చారో చూస్తే..

చైనాతో మా సంబంధాలు భారత్‌కు వ్యతిరేకం కాదు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు – అది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు. మేము ఎప్పుడూ భారత్-చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు. రష్యా భారత్‌కు S-400 ఇస్తుంది, చైనాకు SU-35 ఇస్తుంది – ఇది వ్యాపారం. రెండు దేశాలతోనూ మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్నారాయణ.

భారత్ క్వాడ్‌లో ఉంది, అమెరికాతో దగ్గరవుతోంది. ఇది రష్యాకు సమస్య కాదా? అన్నది స్ట్రెయిట్ క్వశ్చిన్. కాగా.. పుతిన్ ఇందుకు చెప్పిన ఆన్సరేంటంటే.. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానం ఉంటుంది. 1950-60లలో నెహ్రూ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్‌లో ఉన్నా, భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది. మేము దాన్ని గౌరవిస్తామ‌ని అన్నారే త‌ప్ప భార‌త వైఖ‌రిని వ్య‌తిరేఖించ‌లేదాయ‌న‌.

మీరు ఇండియాలో బ్రహ్మోస్, AK-203 తయారీ, అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలను దాటవేయడానికా? అన్నది ఒక ప్రశ్న కాగా..

పుతిన్ నవ్వుతూ.. ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్లు అనుకున్నారు. కానీ మేము బలోపేతమయ్యాం. భారత్‌లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చవకైన ఇంధనం, మాకు స్థిరమైన మార్కెట్. ఇది విన్-విన్ సిత్యువేషన్. ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్లమ’ని క్లారిటీ ఇచ్చారు పుతిన్..

మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2036 వరకు కొనసాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు పుతిన్ చిరుద‌ర‌హాసంతో నేను రిటైర్ అయిన‌ప్పుడు మీడియాలో మొద‌టికే తెలుసుకుంటారు. ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం. ఒకవేళ నేను వెళ్లిపోతే ఎవరూ దేశాన్ని విడదీయకుండా చూడాలి. అది జరిగే వరకు నేను ఉంటానని స్పష్టం చేశారు..

ఇదీ పుతిన్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఆన్సర్స్ ఇచ్చిన విధానం. అప్పుడప్పుడూ అక్క‌డ‌క్క‌డా చిరున‌వ్వులే త‌ప్ప‌.. ఎలాంటి హావ‌భావ విన్యాసాల‌ను చేయ‌లేదాయ‌న‌. భార‌త్ ప‌ట్ల త‌న వైఖ‌రి చెప్పేట‌ప్పుడు మాత్రం ఒకింత న‌మ్మ‌కంగా స్థిర‌చిత్తంతో చెప్పిన‌ట్టు క‌నిపించింది.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird