
డిసెంబర్ 4, 2025 2:17PMన పోస్ట్ చేయబడింది
.webp)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశ సంపద అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అలాంటి ఎస్పీ బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేంటని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని. మరోవైపు దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు.
కేంద్ర మంత్రి కి రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. నగరం కూడా కాలుష్యరహితంగా మారుతుందని మహేశ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ కుటుంబానికి అవినీతిలా కనిపిస్తోందని. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
