

-ఫ్యాన్స్ ఏమంటున్నారు!
-పవన్ ఏం చెప్పబోతున్నాడు!
-అధికార పార్టీ ఏమంటుంది!
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)ఇటీవల ఆంధ్రప్రదేశ్(ఆంధ్రప్రదేశ్)డిప్యూటీ సిఎం హోదాలో బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లిలో మాట్లాడుతు తెలంగాణ(తెలంగాణ)నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని ఇప్పుడు కోనసీమలోకి కొబ్బరి చెట్లకి దిష్టి తగిలిందని చెప్పారు. దీంతో తెలంగాణాకి చెందిన పలువురు నేతలు పవన్ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.
అధికార కాంగ్రెస్ నాయకులైతే తెలంగాణ ప్రజలకి పవన్ క్షమాపణ చెప్పాలని లేదంటే పవన్ సినిమాలని తెలంగాణాలో ఆడనివ్వమని ఖరాఖండిగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తన మాటలపై పూర్తి వివరణ ఇవ్వలేదు.ఒక వేళ మాట్లాడితే తెలంగాణ బావ జలం తన ఎదుగుదలకి ఉపయోగపడుతుందని చెప్పే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో ఉంది.
ఇది కూడా చదవండి: తెలంగాణాలో అఖండ 2 టికెట్ రేట్లు ఇవేనా!
జనసేన పార్టీ నుంచి మాత్రం పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అధికారకంగా ఒక లెటర్ విడుదలైంది. తెలంగాణకి చెందిన జనసేన నాయకులతో పాటు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు పవన్ మాటలని కావాలని కొందరు వక్రీకరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని,ప్రజలని పవన్ అవమానించలేదు. కొంత మంది నాయకులు తమ రాజకీయ పబ్బాన్ని గడపడానికి ఈ విషయాన్నీ రాద్ధాంతం ఎక్కువగా మాట్లాడుతున్నారు.
