
.webp)
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబో మూవీతో పాటు పలు సినిమాలు రాబోతున్నట్లు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. (దిల్ రాజు)
“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము చెబుతున్నాము” అన్నారు.
“ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాకు ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి.
దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము” అని దిల్ రాజు తెలియజేశారు.
దిల్ రాజు స్టేట్ ని బట్టి చూస్తే.. సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది. అదే సమయంలో అక్షయ్ కుమార్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
