
డిసెంబర్ 3, 2025 8:38PMన పోస్ట్ చేయబడింది

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఏడు వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ అందించారు. ఆర్థిక సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.
శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ప్రీ ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తుంది. అమరావతిలో దివ్యాంగ భవన్ నిర్మిస్తామని చెప్పారు. దివ్యాంగులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు.