
డిసెంబర్ 3, 2025 7:36PMన పోస్ట్ చేయబడింది

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ఫిర్యాదును నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో ఉంచారు. తాను కోట్ల రూపాయలను దోచుకున్నానని కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత కాకానికే దక్కుతుందని అన్నారు. కాకాణి మనిషి జన్మ ఎత్తితే ఇలాంటి నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ నాపై నిరాధార ఆరోపణలు చేసాడు..మా కుటుంబ దేవాలయాలకు, బడులకు, ఆసుపత్రికి భూములిచ్చిన చరిత్ర మాదని సోమిరెడ్డి తెలిపారు.
14.5 ఎకరాలు దాదాపు 60 కోట్లు విలువ చేసే భూములిచ్చామని చెప్పారు. త్వరలో కాకానీ అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు పోక తప్పదని అన్నారు. కాకానికి మిగిలిన రాజకీయ నాయకుల్లాగా సంస్కారవంతంగా విమర్శలు చేయడం చేత కాదని అన్నారు. ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ మేరకు గత నవంబరులో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు
