
డిసెంబర్ 3, 2025 4:55PMన పోస్ట్ చేయబడింది

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ స్పెషల్ రిజర్వ్ గార్డ్, సిఆర్‌పీఎఫ్ సిబ్బంది బుధవారం ఉదయం బస్తర్ డివిజన్‌లోని ప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్. అక్కడ మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనాస్థలి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్. గతంలో మావోయిస్టు పార్టీ లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచన మేరకు 2022 ఆగస్టు 31 నాటికి దేశాన్ని మావోయిస్టు భారత్ గా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
