Home Latest News వియ్ వాంట్ 99s వింటేజ్ బాబూ ఫర్ ఏపీ సేఫ్టీ! | సీఎం చంద్రబాబు| బొత్స సత్యనారాయణ| వైఎస్ జగన్| టీడీపీ| నారాలోకేష్| YSRCP| సి.బి.ఐ – ACPS NEWS

వియ్ వాంట్ 99s వింటేజ్ బాబూ ఫర్ ఏపీ సేఫ్టీ! | సీఎం చంద్రబాబు| బొత్స సత్యనారాయణ| వైఎస్ జగన్| టీడీపీ| నారాలోకేష్| YSRCP| సి.బి.ఐ – ACPS NEWS

by Admin_swen
0 comments
వియ్ వాంట్ 99s వింటేజ్ బాబూ ఫర్ ఏపీ సేఫ్టీ! | సీఎం చంద్రబాబు| బొత్స సత్యనారాయణ| వైఎస్ జగన్| టీడీపీ| నారాలోకేష్| YSRCP| సి.బి.ఐ

డిసెంబర్ 2, 2025 8:50PMన పోస్ట్ చేయబడింది


ఆ ప్రభుత్వం కేసులు పెడుతుంది- ఈ ప్రభుత్వం కేసులు కొట్టేస్తుంది…. ఇదీ ప్రెజంట్ ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తోన్న కామెంట్.. చంద్రబాబు మీద మొన్న ఫైబర్ కేసు ఉంటే దాన్ని కొట్టేశారు. అదంతా రాజ‌కీయ క‌క్ష సాధింపులో భాగంగా.. పెట్టిన కేసు. ఇందులో మరేమీ లేద’ని తేల్చేసింది సిఐడీ. ఒప్పందం కేబుల్ ఆప‌రేట‌ర్ల అసోసియేష‌న్ సైతం న్యాయం గెలిచిందంటూ బాబుకూ, న్యాయ‌దేవ‌త‌కూ పాలాభిషేకాలు చేసింది.

తాజాగా చంద్ర‌బాబుపై మ‌రో కేసు కూడా కొట్టివేయ‌బ‌డింది. అదెలాంటిదంటే, 2015-19 మధ్య కాలంలో.. రూ. 1300 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం కేసు. అంటే గ‌తంలో జగ‌న్ హ‌యాంలో పెట్టిన ఇలాంటి కేసుల‌న్నీ తేలిపోనున్నాయ‌న్న‌మాట‌. ఈ లెక్కన చంద్ర‌బాబు క్లీన్ చిట్‌తో పాత కేసుల నుంచి దాదాపు బ‌య‌ట ప‌డిపోనున్నార‌న్న‌మాట‌.

మ‌రి జగ‌న్ మోహ‌న్ రెడ్డి తిరిగి అధికారం చేప‌డితే ప‌రిస్థితేంటి??? అన్న దగ్గ‌రే అంద‌రి ప్ర‌శ్న‌లు ఆగిపోతున్నాయి. అందుకే బాబు కూడా ప‌దే ప‌దే మ‌ళ్లీ మీరు మ‌ళ్లీ వైకుంఠ పాళి ఆడొద్ద‌ని ఆంధ్ర ఓట‌రు జ‌నానికి నూరిపోస్తూ వ‌స్తున్నారు.

కానీ గ్రౌండ్ లెవల్లో ప‌రిస్థితి కూట‌మి ప్ర‌భుత్వానికి చాలా వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నీసం టీటీడీ వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను సంపాదించ‌లేక పోతున్నామ‌ని సోష‌ల్ మీడియా గోడ‌ల మీద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న త‌మ్ముళ్లూ, సైనికులు కోకొల్ల‌లుగా ఉన్నారు. వారి ఫస్ట్రేషన్ ప్రెజంట్ అలా ఉంది మరి.

ఇటీవ‌ల ఒక ప్రైవేట్ ఛానెల్.. ఆంధ్ర ఓట‌రు నాడి ఏమిటో ప‌సిక‌ట్టే య‌త్నం చేసింది. అయితే ఇందులో 2029లో జగ‌న్ తిరిగి అధికారంలోకి రావ‌డానికే ఆస్కార‌మెక్కువ అన్న విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో వైసీపీ జ‌నానికి ఇది మ‌రింత కిక్ ఇచ్చింది.

అయితే, ఇక్క‌డే మ‌నం మ‌ర‌చిపోరానిది వ‌దిలి పెట్ట‌రానిదీ ఏంటంటే,, జ‌గ‌న్ గ‌త ప‌రిపాల‌న‌లో భాగంగా ఓట‌రు జ‌నం న‌ట్టిన సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర కుమ్మ‌రించారు. ఇంత చేసి కూడా వైసీపీ గెల‌వ‌కుంటే ఇక జ‌గ‌న్ కూడా కొత్త రాజ‌కీయాల‌ను నేర్చుకోవాల్సిందే అన్న కామెంట్లు వినిపించాయి. కానీ, చంద్ర‌బాబు త‌న అనుభ‌వ‌మంతా రంగ‌రించారు. ఆపై ప‌వ‌న్ కూడా అగ్నికి వాయువు తోడైన‌ట్టు తోడ‌య్యారు. ఇందుకు కమల వ్యూహం కూడా ఫలించింది. దీంతో పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో.. అందరికీ తెలుస్తుంది.. 164 సీట్లతో కూటమి ప్రభంజనంలాంటి విజయాన్ని సొంతం చేసుకుంది. .

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు రెండోసారి తిరిగి గెలిచింది కేవ‌లం 1999లో మాత్ర మే. ఆ టైంలో ఆయ‌న అడ్మినిస్ట్రేష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ కావ‌డం.. ఐటీ ద్వారా ఉమ్మ‌డి ఆంధ్ర పెద్ద ల‌బ్ధి పొంద‌డం.. స‌త్యం వంటి మ‌న తెలుగు వారి ఐటీ కంపెనీల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు రావ‌డంతో బాబు ఒక మోడ్ర‌న్ ఫేస్ క‌ట్ ఆఫ్‌గా అవ‌త‌రించారు..

ఇది గుర్తించిన వైయస్.. నాడు త‌న ఆత్మ‌లాంటి కేవీపీతో బాబు పోక‌డ చూస్తుంటే మ‌నం అధికారంలోకి రావ‌డం ఇక క‌ల్ల అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు చెబుతారు. క‌ట్ చేస్తే వైయ‌స్ పాద‌యాత్ర‌తో బాబు హ్యాట్రిక్ ఆశ‌ల‌న్నీ కొట్టుకుపోయాయి. అలిపిరి బ్లాస్టింగ్ వంటి సెంటిమెంట్లు కూడా ఏమంత కాలిసి రాలేదు. అంత‌గా వైయ‌స్ హ‌వా వీచిందానాడు.

ఆ త‌ర్వాత కూడా ఆయా పార్టీల‌తో జత క‌డితే త‌ప్ప బాబు గెలిచే ప‌రిస్థితి లేదు అన్న కామెంట్లు వినిపించాయి ఆ మాట‌ను నిజం చేస్తూ బాబు, ఆయ‌న పార్టీ కూడా సేమ్ టు సేమ్ పెర్ఫామెన్స్ చేస్తూ వ‌చ్చింది.

ఇప్పుడు బాబు చివ‌రి అస్త్రంగా చేయాల‌ంటే.. త‌న‌కు తాను స్వ‌యంగా ఈ పిచ్చి కేసుల గోల నుంచి బ‌య‌ట పడాల‌న్నా.. ఏపీని జ‌గ‌న్ అనే ఒక మాయావి నుంచి ర‌క్షించాల‌న్నా.. తిరిగి బాబులో 1999 నాటి వింటేజ్ బాబు విశ్వ‌రూపం చూపించ‌గ‌ల‌గాలి.

అప్పుడుగానీ ఇటు ఏపీ వాసుల’కు జ‌గ‌న్ పీడ వ‌ద‌ల‌దు, అటు చంద్ర‌బాబు కేసుల గోల కూడా ఉండ‌దు.. జ‌గ‌న్ ఇక అట్నించి అటే వెళ్లిపోతే త‌ప్ప ఏపీకి ఈ కేసులు, అప్పుల గొడ‌వ త‌ప్ప‌దు. అలాంటి ప‌థ‌కం ర‌చించ‌డానికి కూడా చాలా చాలా ద‌గ్గ‌రి మార్గాలున్నాయి. వాటి ప‌రిశీల‌న అన్వేష‌ణ చేయాల్సి ఉంది.. బాబు కోర్ క‌మిటీ.

అయితే బాబు కేంద్రానికి త‌న వ‌ద్ద‌నున్న ఎంపీ సీట్ల భ‌రోసా ఇచ్చి, జ‌గ‌న్ అనే ఈ భూతాన్ని శాశ్వ‌తంగా రాజ‌కీయ భూస్తాపితం చేస్తే త‌ప్ప‌.. ఇవ‌న్నీ నెర‌వేరేలా లేవు. మ‌రి.. 2029 నాటికి చూడాలి చంద్ర‌బాబు చాణ‌క్యం ఎలా ఉండ‌నుందో.. ఈ ఒక్క‌టి నెర‌వేరిపోతే.. ఇటు ఏపీ ఊపిరి పీల్చుకుంటుంది.. అటు చంద్ర‌బాబు కూడా న‌వ్యాంధ్ర‌చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అంటారు ప‌లువురు విశ్లేష‌కులు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird