
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు కనిపిస్తున్నాయి సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో నటిస్తున్న ‘స్పిరిట్’పైనే అందరి దృష్టీ ఉంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎంతో ఈగర్‌గా ఎదురు చూశారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా షూటింగ్ పూజ కార్యక్రమాలతో. సాధారణ షూటింగ్ కూడా నవంబర్‌లోనే స్టార్ట్ చేస్తారని తెలిసింది. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని కోఠి పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది.
విశేషమేమిటంటే.. ఫస్ట్ షెడ్యూల్‌లోనే ప్రభాస్ ఎంటర్ అయ్యాడు. అయితే అతని లుక్ రివీల్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సందీప్‌రెడ్డి. కానీ, అత్యుత్సాహం చూపించే అభిమానులు మాత్రం ఏదో ఒక మూల నుంచి తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్‌తో క్లిక్ మనిపిస్తారు. తాజాగా అలాంటి పిక్ ఒకటి బయటికి వచ్చింది.
షూటింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ‘వారణాసి’ విషయంలో లీక్‌లను ఆపలేకపోయాడు. మరి సందీప్‌రెడ్డి వల్ల అది అవుతుందా? అనేది అందరి సందేహం. అయితే ‘స్పిరిట్’కి సంబంధించి లీక్ అయిన ఒక ఫోటో బ్యాక్ ఫేస్‌తో ఉన్నట్లు ఉంది. లీక్ విషయం తెలియగానే వెంటనే అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. మరి లీక్ అనేది ఈ ఒక్క ఫోటోతో ఆగుతుందా? భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవకాశం ఉందా? దాన్ని ఆపేందుకు సందీప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
