
నవంబర్ 29, 2025 9:43AMన పోస్ట్ చేయబడింది
.webp)
సైబర్ క్రైమ్ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ శనివారం (నవంబర్ 29) మూడో రోజుకు చేరుకుంది. తొలి రెండు రోజుల విచారణలో పోలీసులు ఐబొమ్మ రవి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్జిలా నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలు, అలాగే రవికి సంబంధాలు ఉన్న అనధికారిక వెబ్‌సైట్‌ల గురించి పోలీసులు కీలక సమాచారం, ఆధారాలు రాబట్టినట్లు చూపుతున్నారు.
అలాగే ఐపీ మాస్క్ చేసి పనిచేస్తున్న కొన్ని ముఠాలపై కూడా సైబర్ క్రైమ్ అధికారులు ఆధారాలు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా రవి నిర్వహించినట్లుగా, యాడ్ బుల్ గేమింగ్–బెట్టింగ్ యాప్ ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు కూడా రవి విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలి రెండు రోజులలోనూ రవిని పూర్తిగా ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు, బ్యాంకు లావాదేవీలు, నిధుల ట్రాన్సాక్షన్లపై సాగుతున్నట్లు కనిపిస్తోంది.
కస్టడీ చివరి రోజైన శనివారం (నవంబర్ 29) మరింత లోతుగా విచారించి, సాయంత్రం రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇలా ఉండగా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి.. తన నేరాలను అంగీకరించినట్లు సమాచారం. కేవలం డబ్బుల కోసమే పైరసీ చేశాననీ, ఇకపై పైరసీ జోలికి పోననీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. విదేశీ పౌరసత్వం కారణంగా పైరసీ గుట్టు రట్టైనా, చట్టం నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు రవి చెప్పాడని. అలాగే ఆరేళ్లుగా పైరసీ చేస్తున్నా పట్టుబడకుండా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు రవి విచారణలో చెబుతున్నారు.
