
నవంబర్ 28, 2025 10:04AMన పోస్ట్ చేయబడింది
.webp)
కన్నతల్లి, పుట్టిన ఊరు సమానం అంటారు. అలాంటి సొంత ఊరికి సేవ చేయడం కోసం అమెరికాలో లక్షల్లో వేతనం ఉన్నతోద్యోగాన్ని తృణ ప్రాయంగా త్యజించి వచ్చేశారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్. చిన్న సేవ చేసి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేయాలన్న తలంపుతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శంకరం పేటకు వచ్చిన శంకర్ కు అప్పట్లో గ్రామ యువత ఘనస్వాగతం పలికారు. అప్పటి నుంచీ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తున్న సర్పంచ్ కంజర్ల శంకర్ ఇప్పుడు గ్రామ గ్రామాన పోటీకి దిగుతున్నారు.
గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా చేసి వచ్చిన కంజర్ల శంకర్.. గ్రామ సర్పంచ్ గా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతోనే పోటీని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన తాత శంకరప్ప నాలుగవ దశాబ్దాల పాటు సర్పంచ్ గా గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారనీ, ఆయన వారసత్వాన్ని కొనసాగించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ నెల 30న తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయవలసి ఉంది.
