
నవంబర్ 28, 2025 9:20AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి రగిలింది. సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల కోసం గ్రామాలలో వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు, పోలింగ్ ద్వారా మొత్తం వృధా చేయడం కంటే వేలంపాట సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసి, ఆ వచ్చిన సొమ్మును గ్రామ అభివృద్ధికి వినియోగిస్తే గ్రామానికి మేలు జరుగుతుందన్న తలంపుతో పలు గ్రామాలలో సర్పంచ్ పదవుల కోసం వేలపాటలు జరుగుతున్న పరిస్థితి. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ టంకర్ గ్రామ పంచాయితీకి జరిగిన వేలం పాటలో కోటి రూపాయలకు సర్పంచ్ పదవిని ఓ వ్యాపారి దక్కించుకున్నారు. అలాగే గద్వాల పరిధిలోని కొండపల్లి గ్రామ పంచాయతీ పదవి 60లక్షలకు, గొర్లఖాన్ దొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టు 57 లక్షల రూపాయలకు, చింతల కుంట సర్పంచ్ పోస్టు 38 లక్షలకు వేలంపాటలో అమ్ముడు పోయాయి.
అడలా ఉండగా గ్రామంలో సేవ చేయడమే లక్ష్యంగా లక్షల రూపాయల వేతనం వచ్చే ఉన్నతోద్యోగాలను వదిలి మరీ సర్పంచ్ పదవి కోసం పోటీ చేయడానికి ముందుకు వస్తున్న వారూ ఉన్నారు. అలా చిన్న శంకరం పేటకు చెందిన ఎన్ఆర్ కంజర్ల చంద్రశేఖర్ తమ ఐద్వా సేవించాలన్న ఉద్దేశంతో తనని వదిలి ఆరు నెలల కిందటే గ్రామానికి వచ్చి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా తన వంతు సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన తాత శంకరప్ప నాలుగవ దశాబ్దాల పాటు గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారనీ, ఆయన వారస్వాన్ని కొనసాగించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ నెల 30న తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయవలసి ఉంది.
