
నవంబర్ 25, 2025 2:42PMన పోస్ట్ చేయబడింది

ఇటీవలకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈవీఎంలను నిందించడం అలవాటుగా మారింది. తాజాగా బీహార్ ఎన్నికల ఓటమిపై స్పందించిన జన సురాజ్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా ఈవీఎంల కారణంగానే తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని. ఒక్క ఈవీఎంలే కాకుండా అదృశ్య శక్తుల ప్రమేయంవల్ల కూడా తాము ఓటమి పాలయ్యామని చెప్పారు. అయితే అదృశ్య శక్తుల ప్రమేయాన్ని తాము చాలా ఆలస్యంగా గుర్తించామని నొచ్చుకున్నారు. తాను చెబుతున్న విషయాలన్నీ అక్షర సత్యాలన్న ఆయన అయితే ఈ సత్యాలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు లేవనిచేతులెత్తేశారు.
ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర పరాజయం పొందడం ఒక మిస్టరీగా ప్రదర్శన. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. జీరో స్ట్రైక్ రేట్ స్థాయి. అంటే పోటీ చేసిన మొత్తం స్థానాల్లో పరాజయం పాలైంది. ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఆయన మాట్లాడుతూ తమ జన సురాజ్ పార్టీకి చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనా..3.5 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఘోర పరాజయంతో పీకే గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పతనమైంది. ఇంత కాలం ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ పార్టీల విజయంలో తనదే సింహభాగమంటూ జబ్బలు చరుచుకున్న పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకే ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే తాజాగా జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓటమికి కారణం ఈవీఎంలు, అదృశ్య శక్తులు అంటూ చెప్పుకొచ్చారు.
“జనసురాజ్ పార్టీగా తాము బాగానే పని చేశాం అని కితాబిచ్చుకున్న పీకే.. ప్రజల నుంచి కూడా తమకు మంచి మ„తు లభించి.. ఎక్కడికి వెళ్లినా. ఏమో.. ఇలా అయిందంటూ పీకే నిర్వేదం వ్యక్తం చేశారు.
