
నవంబర్ 24, 2025 11:22AMన పోస్ట్ చేయబడింది

మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంపై మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. మహారాష్ట్ర దేవేంద్రఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం విశ్వభూషణ్ సాహు, ఛత్తీస్ గడ్ విష్ణుదేవ్ సాయిలకు రాసిన ఆ లేఖలో మావోయిస్టులు లొంగిపోతాం, మారిపోతాం.. ముందు మావోయిస్టుల ఏరివేతకు సీఎం కూంబింగ్ ను ఆపండి అంటూ విజ్ఞప్తి చేశారు. లొంగుబాటుపై ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో అవకాశం. ఇటీవల పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజ్ ఎన్ కౌంటర్ తరువాత పార్టీ పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని.
కూంబింగ్ ఆపివేతస్తే ఆయధ విరమణపై స్పష్టమైన తేదీని ప్రకటించామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై పార్టీ జోన్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆపరేషన్ కగర్ లో భాగంగా జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూంబింగ్ ఆపివేస్తే లొంగిపోతాం, ఆయుధాలను వదిలేస్తామంటూ లేఖ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
