
నవంబర్ 22, 2025 9:52PMన పోస్ట్ చేయబడింది

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలని, అందులోనూ మహిళలు ఎంటర్ పెన్యూర్ లుగా ఎదగాలన్న చంద్రబాబు సంకల్పం సాకారం అయ్యే దిశగా అడుగులు పడ్డాయి. కుప్పంలో డ్రాక్రా మహిళల నెలకొల్పిన చాయ్ రాస్తా అవుట్‌లెట్ శనివారం ఆరంభమైంది. ఈ రాస్తా చాయ్ ఔట్ లెట్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోసం.
.ఈ సందర్భంగా భువనేశ్వరి కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్ రాస్తా రూపొందించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామంగా అభివర్ణించిన భువనేశ్వరి, మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహదపడతాయి.
రుచి, శుచి, నాణ్యత ప్రధాన నమూనాలో ఏర్పాటైన ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌ను ప్రారంభించిన భువనేశ్వరి మొదటి ఛాయ్‌ని కొనగోలు చేసి తాగారు. చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచిగా చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందించిన చిన చాయ్ రాస్తా చాలా సరికొత్తగా ఉందని ఆమె అభినందించారు.
