
నవంబర్ 22, 2025 3:06PMన పోస్ట్ చేయబడింది
.webp)
కాంగ్రెస్ బహిష్కృత నేత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లన్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సజ్జనార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడనీ, అందుకే ప్రజల మద్దతు చూరగొన్నాడనీ చేర్చాడు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ఇంతకీ సజ్జనార్ పై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు . ఆయన సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే కారణంగా. ఐబొమ్మ రవిని అరెస్టు చేయడమే కారణం అతడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వనన్న తీన్మార్ మల్లన్న ఆమె సమాచారం ఇవ్వకుంటే రవిని పట్టుకోగలిగేవారమని నిలదీశారు.
సినీమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచేయడం వల్లనే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడలేని వారు ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారన్న తీన్మార్ మల్లన్న వంద రూపాయల సినిమా టికెట్ ను వేలల్లో అమ్ముకునే నిర్మాతలతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. ఐబొమ్మ రవి అరెస్టు కాదు.. దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు. సీవీ ఆనంద్ కూడా ఆగవని చెప్పిన సాయిని గుర్తుచేశారు.
