

జై హనుమాన్ కీలక అప్ డేట్
మరో సంచలనానికి రిషబ్ శెట్టి రెడీ!
ప్రశాంత్ వర్మ ఏం చెప్పనున్నాడు.
జనవరి నుంచి ప్రారంభం కాబోతుందా!
కాంతార చాప్టర్ 1 (కాంతార చాప్టర్ 1)తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ‘రిషబ్ శెట్టి'(రిషబ్ శెట్టి). భారతీయ సినీట్రేడ్ వర్గాలు సైతం ఎవరు ఈ రిషబ్ శెట్టి అనేంతలా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త ఊపుని ఉత్సాహాన్నిచ్చాడు. రిషబ్ రాబట్టిన 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ నే అందుకు సజీవ సాక్ష్యం. దీంతో రిషబ్ శెట్టి అప్ కమింగ్ సినిమాల లిస్ట్ గురించి పాన్ ఇండియా అభిమానులే కాదు పాన్ ఇండియా సినీ ట్రేడ్ వర్గాల సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తూనే ఉన్నారు. ఈ ఉద్దేశ్యాన్నే రిషబ్ శెట్టి కి సంబంధించిన సినీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది వాటిల్లో జోష్ వచ్చినట్లయింది.
రిషబ్ శెట్టి కమిట్ అయిన సినిమాల లిస్ట్ లో పాన్ ఇండియా హిట్ ‘హనుమాన్’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్'(జై హనుమాన్)ఉన్న విషయం తెలిసిందే. యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ, మైథలాజికల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ(Prashanth Varma)దర్శకుడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ఈ మేరకు రిషబ్ శెట్టి ఐదు నెలల డేట్స్ కేటాయించినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే జనవరి నుంచి మే వరకు కంటిన్యూగా ఎలాంటి రెస్ట్ లేకుండా రిషబ్ శెట్టి షూటింగ్ లో పాల్గొంటాడనే టాక్ కూడా జోరుగా వినపడుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చిన అభిమానులు ఎప్పుడు జై హనుమాన్ షూటింగ్ ని కాంప్లీట్ చేసి తమ ముందుకొస్తుందా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కూడా చదవండి: నయనతార కి భారీ గిఫ్ట్.. విలువ 10 కోట్లరూపాయలని అంచనా
జై హనుమాన్ ని ప్రశాంత్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హనుమాన్ ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. హనుమాన్ క్లైమాక్స్ లో రాముడు ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు తీసుకున్న నిర్ణయంతో సినిమాకి ఎండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జై హనుమాన్ కథ, కథనాలపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కాంతార లో శివ స్తుతుడు గా వీర విహారం చేసిన రిషబ్ శెట్టి జై హనుమాన్ లో హనుమాన్ గా మరోసారి విజృంభించడం ఖాయం. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ కి వెళ్ళాల్సింది. కానీ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ వర్మ మధ్య విభేదాలు ఏర్పడటంతో జై హనుమాన్ షూటింగ్ కి వెళ్లలేకపోయింది.
ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ అవ్వడంతోనే జనవరిలో షూటింగ్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. జై హనుమాన్ ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. హనుమంతుడి రూపధారణలో ఉన్న రిషబ్ శెట్టి రాముడి ప్రతిమని అలింగనం చేసుకున్న మోషన్ పోస్టర్ ఇప్పటికే రిలీజైన విషయం తెలిసిందే.

