Home Latest News ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా? | మీకు ఆంధ్రా కాశ్మీర్ తెలుసా| లంబసింగి| వైజాగ్ – ACPS NEWS

ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా? | మీకు ఆంధ్రా కాశ్మీర్ తెలుసా| లంబసింగి| వైజాగ్ – ACPS NEWS

by Admin_swen
0 comments
ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా? | మీకు ఆంధ్రా కాశ్మీర్ తెలుసా| లంబసింగి| వైజాగ్

నవంబర్ 17, 2025 10:10AMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ కూ ఒక కాశ్మీర్ ఉందో తెలుసా? ఏటా పెద్ద సంఖ్యలో పర్యటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. ఆంధ్రాకాశ్మీర్ కు పర్యాటకులు వెల్లువెత్తేందుకు ఒక సీజన్ ఉంది. ఔను శీతాకాలంలో ఆంధ్రాకాశ్మీర్ ను వెతుక్కుంటూ పర్యాటకులు తరలివస్తారు. చల్లటి వాతావరణంలో మరింత చలి ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఆంధ్రాకాశ్మీర్ ఏదంటే.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చలి ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన లంబసింగి. ఔను ఉమ్మడి విశాఖపట్టా లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. చలితిరగడంతో ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగిలో 250 కుటుంబాలు ఉన్నాయి. అటువంటి చిన్న గ్రామమైన లంబసింగికి ఏటా పదిహేను లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. రాత్రి సగటున రోజుకు 20వేల ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్య వాతావరణం ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించడానికే పర్యాటకులు పోటెత్తుతుంటారు.
అసలు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందీ అంటే.. పలు కారణాలు చెబుతుంటారు. ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటం, సహజంగా ఏటవాలుగా ఈ గ్రామంలోకి చలిగాలి రావడం మేఘాలు లోపలకు చొచ్చుకు వచ్చే అవకాశం లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ విధంగా సహజంగా కనిపించే కనిష్ట గృహాలు ఇక్కడ నమోదు అవుతాయి అయితే ఈ గ్రామానికి కేవలం రెండు దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి. లంబసింగి గ్రామంలో శీతాకాలం నాలుగు నెలల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక్కడ మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. సీతాకంలో సాధారణంగా ఉదయం 10 గంటల వరకు సూర్యుడు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడు. దీంతో చలి తీవ్రతతో పాటు చెట్ల మధ్య నుంచి సూర్యకిరణ దృశ్యాలు సుతిమెత్తగా తాకే ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఈ ప్రాంతంలో పర్యాటన శాఖతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా రిసార్ట్లు హోటల్స్ రావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. నవదంపతులు లంబసింగిని హనీమూన్ స్పాట్ గా. ఇటీవలి కాలంలో ఒడిస్సా ఛతిస్గడ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర నుంచి నూతన జంటలు పెద్ద సంఖ్యలో లంబసింగికి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
లంబసింగి విశాఖ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో విశాఖ నుంచి నర్సీపట్నం వరకు 100 ఘాట్‌ మైదాన ప్రాంతంలో ప్రయాణం చేస్తే మిగిలిన 30 కిలోమీటర్లు రోడ్డులో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.

వెండి మబ్బుల పాల సంద్రం.. చెరువుల వెనుక

ఇక లంబసింగి పరిసరాల్లో కూడా బోలెడన్ని సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ఇండియా స్విట్జర్లాండ్ గా చెప్పుకునే చెరువుల వెనం గ్రామం ఒకటి. లంబసింగికి కేవలం రెండు దూరంలో కొండనున్న ఈ గ్రామంలో ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు, పాలసముద్రంలా కనిపిస్తాయి. దీంతో చాలామంది పర్యాటకులు తెల్లవారుజామున లంబసింగి నుంచి నడుచుకుంటూ ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆనందపరవశులౌతారు. ఇటీవలే ఏపీ టూరిజం అక్కడకు స్థానిక గిరిజనుల ద్వారా నేరుగా వాహనాలను నడుపుతున్నందున వయసు పైబడిన వారు కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

అలాగే లంబసింగికి సమీపంలో ఉన్న తాసంగి రిజర్వాయర్ కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిన దర్శనీయ స్థలం. ఇక్కడ రిజర్వాయర్ దాటుతూ లింక్ లైన్ ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ పైనుంచి లైన్ లో వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిగా పర్యాటకులు చెబుతారు.

ఇక ఈ ప్రాంతంలోని చరిత్రాత్మక అవశేషాలు కూడా పర్యాటకులకు ఆసక్తిని కలిగిస్తాయి. స్వతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు ఆనవాళ్లు ఇక్కడకు సమీపంలో రూథర్డ్ అనే బ్రిటిష్ మేజర్ నివాసం ఉందనీ, అక్కడే అల్లూరి సీతారామరాజు మట్టుపెట్టినట్లు చరిత్ర చెబుతోంది దీనికి తగ్గట్టు రూథర్‌ఫర్డ్ నివాసం ఉన్న గెస్ట్ హౌస్, శిబిరాలు కనిపిస్తున్నాయి. ఇక మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ సంచరించినట్లు స్థానికులు చెప్తారు ఇక్కడ గిరిజన ప్రజల సంప్రదాయాలు నివాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థానికుల థింసా డాన్స్ మరొక ప్రత్యేక ఆకర్షణ. స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు థిసా డాన్స్ చేస్తూ ఆనందపరవశులు కావడం లేదు.

పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా ఏపీ టూరిజం రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. ఇతర హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు పరిమితంగా వచ్చే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. చల్లని వాతావరణంలో వేడి వేడి టీ… టిఫిన్ లాంటి వంటకాలతో పాటు బెంబు చికెన్ ఇక్కడ పర్యాటకులు అత్యంత ఇష్టపడే వంటకం. గిరిజనుల ఇళ్లల్లో కూడా నివాసం ఉండే రీతిన హోం స్టేజీలను పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. ఇవి అదనపు ఆకర్షణగా మారాయి.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird