
నవంబర్ 16, 2025 6:05AMన పోస్ట్ చేయబడింది
.webp)
ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యం ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయంపై రాహుల్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లాన్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్ సూచనలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన పార్టీల బలోపేతం తదితర కార్యక్రమాలు ఈ సందర్భంగా జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.
